Man swallows keys: బీహార్ మోతిహారికి చెందిన ఓ వ్యక్తి తాళంచెవి, కత్తి, రెండు నెయిల్ కట్టర్‌ని మింగేశాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు అతడి కుటుంబం నిరాకరించడంతో ఈ చర్యకు ఒడిగట్టాడు. పరిస్థితి తీవ్రంగా మారడంతో అతనికి వైద్యులు 1.5 గంటల పాటు శస్త్రచికిత్స చేసి, కడుపులో ఉన్న వస్తువుల్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Illegal affair: భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకున్న భార్య.. తర్వాత ఏమైందంటే..?
బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ఆడేందుకు కుటుంబ సభ్యులు అనుమతించకపోవడంతో ఈ సంఘటన జరిగింది. అయితే, ఈ వస్తువుల్ని మింగిన తర్వాత కొన్ని గంటల పాటు సదరు వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతడి పరిస్థితి విషమించింది. కుటుంబీకులు అతడిని మోతిహరి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పొట్ట ఎక్స్-రే తీయగా అందులో అతను మింగిన వస్తువులు కనిపించాయి. దాదాపుగా గంటన్నర పాటు ఆపరేషన్ చేసి, వైద్యులు వాటిని శరీరం నుంచి తొలగించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించడంతో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు అడ్డు చెప్పడంతోనే తాను కోపంలో వీటిన్నింటిని మింగినట్లు బాధితుడు తెలిపాడు.
