ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం మరుకముందే.. బిల్లు చెల్లించిన ఓనర్ చెల్లించలేదని అనడంతో.. ఓనర్ పై ఏకంగా కత్తితో దాడిచేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని జలాన్ జిల్లాలోని ఒరాయ్ పోలీస్టేషన్ పరిధిలోని రాంజీ అనే వ్యక్తి బిర్యానీ తినడానికి ఓ హోటల్ కు వెళ్లాడు. తిన్న తరువాత దుకాణదారుడు రామ్‌సింగ్‌కు రూ.50 బిల్లు చెల్లించాడు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. డబ్బులు చెల్లించలేదని మళ్లీ చెల్లించాలని రామ్ సింగ్.. బిర్యానీ తిన్న రాంజీని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు మధ్య వివాదం తలెత్తింది. మాటమాట పెరగడంతో.. రామ్‌సింగ్, రాంజీని కత్తితో పలుమార్లు పొడిచాడు.
అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఒరాయ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఘటనా సమయంలో నిందితుడు.. బాధితుడు ఇద్దరూ కూడా మత్తులో ఉన్నారని, నిందితుడు పరారీలో ఉన్నట్లు.. త్వరలోనే అదుపులో తీసుకుంటామని పేర్కొన్నారు.
Power Purchase: నిషేధిత జాబితాలో ఏపీ లేదు.. క్లారిటీ ఇచ్చిన ఇంధనశాఖ
