Site icon NTV Telugu

Bihar: అత్తతో అల్లుడి ఎఫైర్.. దగ్గరుండి వివాహం జరిపించిన కుటుంబం..

Bihar

Bihar

Bihar: బీహార్ రాష్ట్రంలోని బంకాలో ఓ సాధారణ ప్రేమ వెలుగులోకి వచ్చింది. అత్త, అల్లుడు ప్రేమించుకున్న ఆ ప్రాంతంలో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే సదరు మహిళ భర్తనే వీరిద్దరికి దగ్గరుండి పెళ్లి చేయడం కొసమెరుపు. భార్య తల్లితో ప్రేమలో పడిన అల్లుడి వ్యవహారం సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులకు వీరి సంబంధం గురించి తెలియడంతో ఈ పెళ్లిని నిర్వహించారు. ఈ ఘటన ఛత్రపాల్ పంచాయతీ హీర్ మోతీగావ్‌లో జరిగింది.

READ ALSO: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..

సమాచారం ప్రకారం.. 55 ఏళ్ల దిలేశ్వర్ దార్వే భార్య గీతాదేవీ(45), వారి అల్లుడు సికిందర్ యాదవ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. సికిందర్ భార్య మరణించిన తర్వాత అతను తన అత్తామామలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ కాలంలోనే అత్తతో అతడు దగ్గరయ్యాడు. గీతాదేవీ ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో, వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సికిందర్ యాదవ్, గీతాదేశీ వ్యవహారంపై గ్రామస్తులు ముందు పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో అత్తపై తనకు ఉన్న ప్రేమను బహిరంగంగా ఒప్పుకున్నాడు. దీని తర్వాత దిలేశ్వర్, గ్రామస్తుల అంగీకారంతో సికిందర్, గీతాదేవీల వివాహం జరిగింది. ఇదే కాకుండా దిలేశ్వర్ తన భార్య, అల్లుడి మధ్య కోర్టు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. గ్రామస్తుల ఆమోదంతో అందరి సమక్షంలో గీతాదేవిని సికిందర్ తన ఇంటికి తీసుకెళ్లాడు.

Exit mobile version