Man Dragged Under Car For 10 km In UP: న్యూఇయర్ రోజున ఢిల్లీలో ఓ యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ఇలాగే మరికొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఢిల్లీ ఘటన రిపీట్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ మథురలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు వ్యక్తి మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కారు నడుపుతున్న వ్యక్తని ఢిల్లీకి చెందిన వీరేందర్ సింగ్ గా గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఆ వ్యక్తి వేరే ప్రమాదంలో మరణించాడని..కారు వెళ్తున్న సందర్భంలో కారు కింద చిక్కుకున్నాడని.. వీరేందర్ సింగ్ పేర్కొన్నాడు.
Read Also: Abdul Razzaq: ఆసియా కప్ దుబాయ్‌లో నిర్వహిస్తే మంచిదే: పాక్ మాజీ క్రికెటర్
ఆగ్రా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మధుర సమీపంలోని టోల్ బూత్ వద్ద కారు కింద మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సిబ్బంది ఆపిన తర్వాత కారు కింద నలిగిపోయిన మృతదేహం కనిపించింది. సోమవారం రాత్రి దట్టమైన పొగమంచు ఉందని.. తన కారు కింద మృతదేహం ఉన్నట్లు గుర్తించలేదని పోలీసులకు సింగ్ వెల్లడించారు. రాత్రి దట్టమైన పొగమంచు కారణంగా విజిబిటిటీ తక్కువగా ఉందని.. దీని కారణంగా ప్రమాదానికి గురైన వ్యక్తి కారు కింద ఇరుక్కుపోయి ఉండవచ్చని ఎస్పీ ట్రిగన్ బిసెన్ చెప్పారు. ఈ ఘటనపై వీరేందర్ సింగ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తి ఎలా మరణించాడు అనేదానిని నిర్థారించుకోవడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.
జనవరి 1 న్యూఇయర్ తెల్లవారుజామున ఢిల్లీలో 20 ఏళ్ల అంజలి సింగ్ స్కూటర్ పై వెళ్తున్న సమయంలో ఆమె స్కూటర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజలి కారు కింద చిక్కుకుపోయింది. 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాలపై అంజలి మరణించింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.