Site icon NTV Telugu

Maharashtra: సీఎం ఇంటి మందు ఆత్మహత్యాయత్నం..

Eknath Shinde

Eknath Shinde

Maharashtra:మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శనివారం ఉదయం థానేలోని సీఎం నివాసం ముందు 42 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఆటో డ్రైవర్ వినయ్ పాండే తనపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నంలో ఒత్తిడికి గురై కిందపడిపోయాడని అధికారులు వెల్లడించారు.

Read Also: Adipurush: ఆదిపురుష్‌పై ఆప్ వర్సెస్ బీజేపీ.. మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణ.

వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేయడం వల్ల ఇప్పటి వరకు లైసెన్స్ ఇవ్వలేదని వాపోయాడని తెలిపారు. విచారణలో భాగంగా అతడితో మాట్లాడుతున్నట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గామారింది. వీడియోలో ఆటో డ్రైవర్ బిగ్గరగా అరుస్తున్నట్లు వినవచ్చు. ఈ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు.

Exit mobile version