NTV Telugu Site icon

Kolkata doctor case: సందీప్ ఘోష్‌కు సీఎం మమత బర్త్‌డే విషెస్ చెప్పిన లేఖ వైరల్

Kolkata Doctor Murder Case

Kolkata Doctor Murder Case

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖ తాజాగా వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మమత లేఖ రాసింది. కోల్‌కతా ఘటన తర్వాత ఈ లేఖ వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. సందీప్ ఘోష్‌తో మమతకు ఉన్న సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో చెప్పొచ్చని విపక్షాలు దుమ్మెత్తిపోస్తు్న్నాయి. అయితే ఈ లేఖ 2022 జూన్‌ 30న రాసింది. కానీ తాజాగా వైరల్ అవుతోంది.

అయితే ఈ లేఖతో బెంగాల్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్‌ ఘోష్‌ సైతం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ లేఖపై మమతను బీజేపీ టార్గెట్‌ చేసింది. సందీప్‌ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సందీప్ ఘోష్.. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు.

ఇదిలా ఉంటే వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండు రోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్‌జీకార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీష్‌ ఘోష్‌ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్‌ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రస్తుతం సందీప్ ఘోష్‌ను సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది.