Site icon NTV Telugu

Maldives President: ప్రధాని మోడీ “అద్భుతమైన వ్యక్తి”..

Pm Modi.

Pm Modi.

Maldives President: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల మాల్దీవుల పర్యటన ముగిసింది. ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, ఇప్పడు భారతదేశాన్ని, భారత ప్రజల్ని, భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. మోడీ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఊపునిచ్చిందని అన్నారు. భారత్ మాల్దీవుల పర్యాటక రంగానికి సాయం చేసే ప్రధాన దేశాల్లో ఒకటని, ప్రధాని పర్యటన తర్వాత ఇది మరింత పెరుగుతుందని, ఈ పర్యటన కారణంగా రెండు దేశాల ప్రజల మధ్య మరింత మంచి సంబంధాలు నెలకొంటాయని ముయిజ్జూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ప్రమాదం.. 20 కార్లను ఢీకొట్టిన ట్రక్కు..

భారత-మాల్దీవుల సంబంధాలను కొత్త పథంలో తీసుకురావడానికి గత 11 ఏళ్లుగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. నరేంద్రమోడీ ‘‘అద్భుతమైన వ్యక్తి’’ అని మాల్దీవుల అధ్యక్షుడు కొనియాడారు. ‘‘ప్రధాని మోడీ పొరుగువారి మధ్య సంబంధాన్ని నిర్మించడానికి చాలా ఇష్టపడే అద్భుతమైన వ్యక్తి. మాల్దీవులు, భారతదేశం శతాబ్దాల నుంచి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఆయన నాయకత్వంమా రెండు దేశాల మధ్య, రెండు ప్రభుత్వాల మధ్య సహకారంతో, రాబోయే రోజుల్లో ఇది మరింత సంపన్నంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ముయిజ్జూ అన్నారు. మాల్దీవుల 60 స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని మోడీ వెళ్లారు. భారత సహకారంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

Exit mobile version