Site icon NTV Telugu

Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!

Maithili Thakur

Maithili Thakur

ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబైతో పాటు 28 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ఉధృతం ప్రచారం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: West Bengal: కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు! రంగంలోకి రెస్క్యూ టీమ్

ఇక బీహార్ ఎమ్మెల్యే, జనపద గాయని మైథిలి ఠాకూర్‌ను కూడా మహాయతి కూటమి రంగంలోకి దింపింది. ముంబైలో పలుచోట్ల ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మహాయతి కూటమిని గెలిపించాలని కోరారు. అయితే ప్రచారంలో భాగంగా ఆమె తన గానంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రచారంలో ఎక్కువగా పాటలుతోనే ముందుకు సాగారు. హిందీ పాటలతో పాటు మరాఠీ పాటలను ఆలపించారు. దీంతో ఉత్తర ప్రదేశ్, బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న

జనవరి 15న ముంబై మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఇక్కడ మహాయతి కూటమి, థాక్రే కూటమి మధ్య పోటీ నెలకొంది. మరాఠీ మేయర్ రాబోతున్నట్లుగా థాక్రే బ్రదర్స్ చెబుతున్నారు. ఇంకోవైపు హిందూ మరాఠీ మేయర్ వస్తారంటూ మహాయతి కూటమి చెబుతోంది. ఇంతకీ ముంబై ప్రజలు ఏ కూటమికి మద్దతు తెలుపుతారో చూడాలి.

Exit mobile version