NTV Telugu Site icon

Maharastra: లోయలో పడ్డ బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు

Maharastra

Maharastra

మహారాష్ట్రలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై- అహ్మదాబాద్ హైవేపై పాల్ఘర్ జిల్లాలోని వాగోభా ఖిండ్ వద్ద బస్సు లోయలో పడింది. దాదాపు 25 అడుగుల లోతు లోయలో పడటంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఐగుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు ఉత్తర మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోన భుసావల్ ననుంచి పాల్ఘర్ లోని బోయిసర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, ఇతర అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ని మార్చాలని ప్రయాణికులు కండక్టర్ ను కోరినప్పటకీ పట్టించుకోలేదని వెల్లడించారు. ఇదే ప్రమాదానికి కారణం అయిందని ప్రయాణికులు చెబుతున్నారు.