Site icon NTV Telugu

Maharashtra: ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. డ్రైవర్‌ను పొట్టుపొట్టు కొట్టిన మహిళ!

Sam (4)

Sam (4)

మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ మహిళకు అశ్లీల వీడియోలు పంపించాడో ఓ డ్రైవర్. దీంతో ఆ మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టింది. అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు రోజుకు మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా.. వారి ఆగడాలు తగ్గడంలేదు. ఓ మహిళ కొన్ని నెలల క్రితం కంకవ్లిలోని ఒక ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీ కార్యాలయం ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకుంది. దీంతో టికెట్ బుకింగ్ రికార్డుల నుంచి ఆ మహిళ ఫోన్ నంబర్ ను తీసుకున్న బస్సు డ్రైవర్ మెసేజింగ్ యాప్ ల ద్వారా ఆమెకు అశ్లీల వీడియోలను పంపిస్తూ వేధించడం ప్రారంభించాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాకపోవడంతో.. అతడికి బుద్ధి చెప్పాలని ఆ మహిళ అనుకుంది.

దీంతో రెండు రోజుల క్రితం ఆమె మరో మహిళతో కలిసి కంకవ్లి బస్ స్టాండ్ సమీపంలో ఉన్న బుకింగ్ కార్యాలయానికి వచ్చింది. అక్కడే ఉన్న డ్రైవర్ ను గుర్తించింది.. అనంతరం అతడిని పట్టుకుని రోడ్డు పైకి లాక్కొచ్చింది. తన ఫోన్ కు పంపిన బూతు సందేశాలను చూపిస్తూ అతడి రెండు చెంపలపై టపీ టపీ మంటూ కొట్టింది. ఎందుకు తనకు ఆ వీడియోలు పంపిస్తున్నావని… ప్రశ్నించింది. దీంతో ఆ డ్రైవర్ మొహం దాచుకోలేకపోయాడు. . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version