Site icon NTV Telugu

Coronavirus: మంత్రికి కోవిడ్ పాజిటివ్.. ఆయన సిబ్బందికి అస్వస్థత..!

Minister Tests Positive

Minister Tests Positive

మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్‌ ముండే కరోనా బారిపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటించారు. అయితే వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్‌ పేర్కొన్నారు.ఈ మేరకు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్‌ ముండేకు కొవిడ్‌ పాజటివ్‌ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముం‍డేకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

Also Read: Bigg Boss Lahari : క్రిష్టమస్ సెలెబ్రేషన్ లో బిగ్ బాస్ లహరి.. స్టైలిష్ లుక్ లో ఫోటోలు..

అలాగే ‘కొవిడ్‌ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి నుంచే ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్‌ లక్షణాలు లేవు అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

Also Read: Pakistan : పాకిస్థాన్ లో మోస్ట్ పాపులర్ కార్లు..ఎక్కువగా కొనేవి ఏంటో తెలుసా ?

Exit mobile version