మహారాష్ట్రలోని నాసిక్ కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒక భావోద్వేగ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. దేశ సేవ కోసం ఆర్మీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఒక యువ పైలట్ ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది.
కెప్టెన్ భరత్ భరద్వాజ్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మంగళవారం పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ పరేడ్‌కు అనూహ్యంగా ప్రియురాలు ఆరుషి కూడా హాజరైంది. అలా పరేడ్ ముగిసిందో లేదో.. అందరూ చూస్తుండగానే ప్రేయసికి భరద్వాజ్ పెళ్లి ప్రతిపాదన చేశాడు. మోకాళ్లపై కూర్చొని.. ఉంగరం చూపిస్తూ తనను పెళ్లి చేసుకుంటావా? అని అడగానే వెంటనే ప్రతిపాదనను అంగీకరించి వేలుకు ఉంగరం తొడిగించుకుంది. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు. ఈ అనూహ్య సంఘటన అక్కడున్న అధికారులను, కుటుంబ సభ్యులను, అతిథులను భావోద్వేగానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సహచరులు మొబైల్స్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F
— ANI (@ANI) June 2, 2026
