ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మైలురాయిని దాటింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం దగ్గర స్నానాలు చేసేందుకు యాత్రికుల సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన ఈ మేళా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన కార్యక్రమం అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమానికి దేశం నుంచి కాకుండా ప్రపంచ నలుములాల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vizag: సాగర్ తీరంలో నకిలీ ఐఏఎస్ హల్‌చల్.. కిలాడీ లేడి ఆటకట్టించిన పోలీసులు
మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. దీంతో పండుగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండవు. ఈసారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.
ఇది కూడా చదవండి: Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి శుభవార్త.. ఒకే డోస్‌లో ట్యూమర్ తొలగింపు?