NTV Telugu Site icon

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..

Earthquake

Earthquake

Arunachal Pradesh Earthquake: ప్రపంచంలో ఇటీవల కాలంలో వరసగా భూకంపాలు నమోదు అవుతున్నాయి. టర్కీ భూకంప విషాదం ముగియకముందే పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ఆదివారం భూకంపం వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అస్సాం, భూటాన్ దేశం తూర్పు ప్రాంతాల వరకు ప్రకంపనలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12.12 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Read Also: Turkey Earthquake: 46 వేలు దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య.. రెస్క్యూ ఆపరేషన్‌కు స్వస్తి

భూటాన్ సరిహద్దుల్లోని పశ్చిమ కమెంగ్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు నమోదు కాలేదు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వతాలు అధికంగా భూకంపాలు సంభవించే జోన్ లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఇదిలా ఉంటే ఏదో ఓ రోజు హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ పెరుగుతోంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది ఉత్తరం వైపుగా కదులుతూ.. ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను నెట్టుతోంది. ఈ పరిణామం ఏదో సందర్భంలో భారీ భూకంపానికి దారి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.