Site icon NTV Telugu

Madya Pradesh Serial Killer: “కేజీఎఫ్” రాకీభాయ్‌లా ఫేమస్ అవ్వాలని వరసగా హత్యలు

Madhya Pradesh Killings

Madhya Pradesh Killings

Madhya pradesh serial killer inspired by the movie KGF: మధ్యప్రదేశ్ సీరియల్ కిల్లర్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరసగా నలుగురు సెక్యూరిటీ గార్డులను అతి దారుణంగా తలపై కొట్టి చంపాడు. మొత్తం మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణాన్ని భయపెట్టాడు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున టీములను ఏర్పాటు చేయడంతో పాటు.. సాగర్ పట్టణంలో రాత్రి పూట గస్తీని పెంచారు. సీసీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించి స్కేచ్ వేయించిన పోలీసులు.. వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. తాజాగా శుక్రవారం రోజు భోపాల్ లో నిందితుడు శివ ప్రసాద్(19)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఐదుగురు సెక్యూరిటీ గార్డులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కేజీఎఫ్’ సినిమాలో రాకీభాయ్ లా ఫేమస్ అవ్వాలని నిందితుడు కోరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేజీఎఫ్ సినిమా నుంచి ప్రేరణ పొందిన శివప్రసాద్ పేరు సంపాదించాలని ఇలా హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోది. హత్యకు గురైన వారిలో ఒకరి సెల్ ఫోన్ దొంగలించడం వల్ల మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి నిందితుడిని శుక్రవారం ఉదయం భోపాల్ లో అరెస్ట్ చేశారు.

Read Also: MLA Raja Singh: రాజాసింగ్‌కు భద్రత పెంపు.. వేరే బ్యారక్‌కు తరలించిన అధికారులు

నిందితుడు సెక్యూరిటీ గార్డును చంపుతున్న భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెక్యూరిటీ గార్డును హత్య చేసిన తర్వాత తనను ఎవరూ గుర్తించలేదని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. శివ ప్రసాద్ వరసగా రోజుల్లో రాత్రి సమయంలో మూడు హత్యలకు పాల్పడ్డాడు.

మే నెలలో మధ్యప్రదేశ్ లో ఓ ఓవర్ బ్రిడ్జి వద్ద సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిని దారుణంగా చంపాడు. చంపి అతని ముఖంపై షూ ఉంచాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాడు నిందితుడు. గురువారం రాత్రి కూడా సోనూ వర్మ(23) అనే వ్యక్తిని మార్బుల్ రాడ్ తో దారుణంగా కొట్టి చంపాడు. ఆగస్టు28న ఫ్యాక్టరీలో పనిచేసే కళ్యాణ్ లోధిని హత్య చేశాడు. మరుసటి రోజు రాత్రి సాగర్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి శంభు నారాయణ్ దూబేను ఇలాగే హతమార్చాడు. దీని తర్వాత ఓ ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న మంగళ అహిర్వార్ ను చంపేశాడు నిందితుడు. భోపాల్ వెళ్లిన తర్వాత కూడా గురువారం ఓ హత్యకు పాల్పడ్డాడు నిందితుడు శివప్రసాద్.

Exit mobile version