Site icon NTV Telugu

Madhya Pradesh: మధ్యప్రదేశ్ “సీరియల్ కిల్లర్” అరెస్ట్..

Madhya Pradesh Killings

Madhya Pradesh Killings

Man Arrested Over Madhya Pradesh Serial Killings: మధ్యప్రదేశ్ సాగర్ పట్టణాన్ని వణికిస్తున్న సీరియల్ కిల్లర్ ను పట్టుబడ్డట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుల వరస హత్యలతో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతనే సీరియల్ కిల్లర్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ వారం సాగర్ పట్టణంలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు వరసగా హత్యకు గురయ్యారు. పడుకుంటున్న సమయంలో తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు కిల్లర్. తాజాగా అనుమానిత వ్యక్తి భోపాల్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భోపాల్ లో కూడ ఇదే విధంగా ఒక సెక్యూరిటీ గార్డును కొట్టి చంపాడని పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందుతుడిని శివ ప్రసాద్(19)గా గుర్తించారు. మార్బుల్ రాయితో కొట్టి సెక్యూరిటీ గార్డులను హత్య చేశాడని ఖజూరీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంధ్యా మిశ్రా వెల్లడించారు. సాగర్ లో జరిగిన వరస హత్యలకు ఇతనే కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో శివ ప్రసాద్ ని అరెస్ట్ చేశామని ఐజీ అనురాగ్ తెలిపారు.

Read Also: Harish Rao: నిర్మలా సీతారామన్‌కు హరీష్‌ రావ్‌ సవాల్‌.. నేను రాజీనామా చేస్తా.. మీరు చేస్తారా?

సాగర్ పట్టణంలో వరసగా మూడు రోజుల్లో రాత్రి పూట సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురయ్యారు. వారందరూ రాయితో కొట్టడం వల్ల తలపగిలి చనిపోయారు. సాగర్ పట్టణంలో సోమవారం రాత్రి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 60 ఏళ్ల శంబురామ్ దూబే క్యాంటీన్ సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇలాగే మరో దాడి జరిగింది. మంగళ్ అహిర్వార్ అనే సెక్యూరిటీ గార్డును తలపై కొట్టి చంపాడు దుండగులు. మే నెలలో ఇలాగే మక్రోనియా బండ రోడ్డు ఏరియిలో నిర్మాణ స్థలంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఉత్తమ్ రజక్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారి దగ్గర నుంచి ఎలాంటి దోపిడి జరగలేదు. దీంతో సీరియల్ కిల్లర్ కావాలనే ఈ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానించారు.

నిందితుడి ఆచూకీ కోసం పోలీసుల ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. ఇందులో తెల్లటి చొక్కా, షార్ట్ ధరించిన వ్యక్తిని గుర్తించారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన స్కెచ్ ను కూడా వేయించారు పోలీసులు. ఆచూకీ తెలిపిన వారికి రూ. 20,000 బహుమతి ప్రకటించారు. తాజాగా సీరియల్ కిల్లర్ గా అనుమానిస్తున్న సోనూ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Exit mobile version