Site icon NTV Telugu

Madyapradesh: విషాదం.. గర్భా డాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..

Untitled Design

Untitled Design

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు సర్వసాధారణమయ్యాయి.. గతంలో 50ఏళ్లు పైబడిన వారికే.. గుండెపోటు సంభవించేంది. కానీ ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తుంది. ఇలాంటి ఘటనే.. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం యువత ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుండెపోటుతో బలైపోతున్నారు. డాన్స్ చేస్తూ.. కుప్పకూలిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం.. ప్రస్తుతం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తగా పెళ్లైన 19 ఏళ్ల ఒక మహిళ తన భర్తతో కలిసి గర్బా నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతికి నాలుగు నెలల క్రితమే వివాహం అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Exit mobile version