కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి భారత్ జోడ్‌యాత్రలో నమోదైన కేసులో ఊరట లభించింది. 2020, డిసెంబర్‌లో భారత్ జోడ్‌యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు దాఖలైంది. తాజాగా ఈ కేసులో లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించాలని రాహుల్ గాంధీ న్యాయవాదులకు ఆదేశించింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: US Floods: న్యూయార్క్, న్యూజెర్సీని ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుయిన కార్లు, వస్తువులు
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ గాంధీ జోడోయాత్రలో ప్రశ్నించారు. ఎల్‌వోసీ వెంబడి చైనా చర్యలకు భారత్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపైనే రాహుల్‌పై కేసు నమోదైంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరపున వివేక్ తివారీ అనే న్యాయవాది రాహల్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇండియన్ ఆర్మీని రాహల్ కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది. అదే సమయంలో దేశంలోని పలు చోట్ల రాహుల్ గాంధీపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పిటిషన్లు కూడా దాఖలు చేశాయి. మొత్తానికి ఈ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
ఇది కూడా చదవండి: Bengaluru: ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
