LPU Students Protest: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యూనివర్సిటీలోని విద్యార్థినిపై అత్యాచారం జరిగిందే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు విధ్వంసానికి దిగారు. యూనివర్సిటీల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. క్యాంపస్‌లో ఉన్న మిగ్-23 యుద్ధ విమానం, మిలిటరీ ట్యాంక్‌పైకి ఎక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు గర్ల్స్ హాస్టల్ సమీపంలో ఈ నిరసన ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 24న ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, ప్లంబర్ లేదా నిర్మాణ కార్మికుడు అత్యాచారానికి ఒడిగట్టాడని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ కేసులో ముందుగా పోలీసులు ఈ ఆరోపణలపై తమకు ఎలాంటి నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థిని వాంగ్మూలాన్ని స్వీకరించి కేసు నమోదు చేసినట్లు జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా వెల్లడించారు. ఈ కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్, సీసీటీవీ, ఫోన్ డేటా ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.
విద్యార్థుల నిరసనతో క్యాంపస్ యుద్ధ రంగాన్ని తలపించింది. క్యాంపస్ కిటికీల అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. కొన్ని వస్తువులకు నిప్పంటించారు. జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని నిర్బంధించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు.
రేప్ విచారణతో పాటు విద్యార్థులు మరికొన్ని డిమాండ్లను పోలీసుల ముందుచారు. బాలికల హాస్టల్‌లో సిబ్బంది అంతా మహిళలే ఉండాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలో నిజం లేదని రిజిస్టార్ మోనిటా గులాటీ ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది సోషల్ ఎలిమెంట్స్ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేసినట్లు ఆరోపించారు.
#WATCH | Jalandhar, Punjab: Students hold protest at Lovely Professional University (LPU)
Dr. Jaspal Singh Sandhu, Vice Chancellor of LPU, says, "The police registered an FIR based on the students' allegations. All necessary support will be provided. Five students have been… https://t.co/IEWXNrr3Rz pic.twitter.com/EJlAYzYRvs
— ANI (@ANI) September 27, 2026

