Site icon NTV Telugu

Speaker Om Birla: కీలక వ్యాఖ్యలు.. సీఎంను విమర్శిస్తే అనర్హత కాదు..!

Speaker Om Birla

Speaker Om Birla

అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది… సీఎంపై ఆ పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత పరిధిలోకి రావని.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేసింది లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కార్యాలయం.. పార్టీ అధినేత, సీఎంపై, పార్టీ నేతలు, మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజుపై అన‌ర్హత వేటు వేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. మరికొన్ని అనర్హత పిటిషన్ల కూడా పెండింగ్‌లో ఉండగా.. లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కార్యాల‌యం ఇవాళ స్పందించింది.

Read Also: Journey: 82 రోజుల్లో 2,500 కిలోమీట‌ర్ల పాదయాత్ర..

సీఎంను, మంత్రులను విమర్శిస్తే అనర్హత కిందకు రాదని.. 10వ షెడ్యూల్‌లో మార్పులు అవసరమని స్పీకర్‌ ఓం బిర్లా కార్యాలయం పేర్కొంది.. చర్యలకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం నిజమేనని.. కమిటీ నివేదికను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా.. సీఎంపై పార్టీ ఎంపీ ఆరోప‌ణ‌లు అన‌ర్హత వేటు కింద‌కు రావని.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అన‌ర్హత వేటు కింద‌కు వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు.. సీఎం స‌హా మంత్రుల‌ను ఎంపీ విమ‌ర్శించినా కూడా అనర్హత కింద‌కు రాద‌ని పేర్కొంది.. అన‌ర్హత పిటిష‌న్ ప్రివిలేజ్ క‌మిటీ ముందు ఉంద‌న్న స్పీక‌ర్ కార్యాల‌యం.. విచార‌ణ ఎప్పుడు పూర్తి అవుతుంద‌న్న విష‌యాన్ని కమిటీనే చెబుతుంద‌ని తెలిపింది.

Exit mobile version