Site icon NTV Telugu

ఎంపీ రఘురామపై అనర్హత వేటు..? ఇలా స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా

Speaker Om Birla

Speaker Om Birla

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై స్పందించారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ రఘురామపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఆయనపై అనర్హత వేటు వేయాలని విన్నవించారు.. పార్టీ లైన్‌ తప్పారంటూ కొన్ని ఆధారాలను కూడా స్పీకర్‌కు సమర్పించారు.. మరోవైపు.. రఘురామ కూడా స్పీకర్‌ను కలిస్తూ వస్తున్నారు.. అయితే, రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ ఇవాళ స్పీకర్‌ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు.. ఆ ప్రశ్నలకు బదులిచ్చిన స్పీకర్.. లోకసభ సచివాలయం ఆ పిటిషన్లు పరిశీలిస్తోందన్నారు. నిర్ణయం తీసుకునే వరకు దానిపై వివరాలు బహిరంగపర్చలేమని స్పష్టం చేశారు.. ఇందులో ప్రొసీడింగ్స్ ఉంటాయి… ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుందని.. అన్ని వాదనలు విన్న తర్వాత తగిన నిర్ణయం ఉంటుందన్నారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.

Exit mobile version