తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈనెల 21వ తేది వరకు సడలింపుల లాక్‌డౌన్ కొనసాగనుంది. లాక్‌డౌన్ పొడిగించే విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. అమలవుతోన్న సడలింపుల లాక్‌డౌన్ 14తో ముగియనుండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మరో వారం రోజులపాటు పొడిగించారు. కాగా వైన్ షాపులను ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్క్, టీ షాపులకు ఇతర వాటికి పరిమిత సంఖ్యలో అనుమతినిచ్చారు.
తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు
