మణిపూర్ లో 60 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 31
గోవాలో 40 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 21
యూపీలో 403 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 202
పంజాబ్ లో 117 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 59
ఉత్తరాఖండ్ లో 70 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 36
- మణిపూర్‌లో దూసుకెళ్తున్న బీజేపీ.. 29 స్థానాల్లో బీజేపీ.. 10 స్థానాల్లో కాంగ్రెస్.. ఆరు స్థానాల్లో ఎన్‌పీఎఫ్, 9 స్థానాల్లో NPEP, ఆరు స్థానాల్లో ఇతరులు ఆధిక్యం
- గోవాలో ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు మాకే అంటున్న బీజేపీ.
- పంజాబ్ లో హేమాహేమీలను ఓడించిన ఆప్ నేతలు. సీఎం చన్నీ, అమరీందర్ సింగ్, సిద్ధూ ఓటమి. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలే పంజాబ్ ఓటమికి కారణం.
- యూపీ (403) బీజేపీ-272, ఎస్పీ-122, బీఎస్పీ-3, కాంగ్రెస్ 3 ఇతరులు-3
- మణిపూర్ : బీజేపీ-30, కాంగ్రెస్ 8, ఎన్ పీపీ-10, ఇతరులు 12
- గోవాలో హంగ్ అసెంబ్లీ. బీజేపీ-18, కాంగ్రెస్ 12, టీఎంసీ 4, ఇతరులు 6.
- నలుగురు ఇండిపెండెంట్లను లాక్కోగలిగితే బీజేపీ సర్కార్ ఏర్పడే అవకాశం.
- ఎన్నికల్లో హరీష్ రావత్ ఓటమి, కుమార్తె అనుపమా రావత్ గెలుపు. నాలుగు వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన అనుపమా రావత్.
- హరిద్వారా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన అనుపమా రావత్. ఓటమి దిశగా హరీష్ రావత్. 14 వేల ఓట్లతో వెనుకపడ్డ హరీష్ రావత్.
- యూపీలో బీజేపీకి బాగా కలిసి వచ్చిన విపక్షాల అనైక్యత.
- ఈ విప్లవానికి పంజాబ్ ప్రజలకు అభినందనలు.. అంటూ ట్వీట్ చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
- గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టిన బీజేపీ. సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ సీనియర్ నేతల స్ట్రాటజీ మీటింగ్. అత్యధిక సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండబోతున్నామని బీజేపీ అంచనా. ఇండిపెండెంట్లు లేదా ఎంజిపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు.
- పంజాబ్ ప్రజలు కేజ్రీవాల్ పై పూర్తి విశ్వాసం చూపారు. ఢిల్లీ మోడల్ పాలనను పంజాబ్‌లో అందిస్తాం-సిసోడియా
- ఖటిమా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.
- గెలుపు, ఓటముల మధ్య ఊగిసలాడుతున్న పుష్కర్ సింగ్ ధామి. మూడవ రౌండ్ తర్వాత 2 ఓట్ల వెనుకబడ్డ పుష్కర్ సింగ్ ధామి. ఇంకా మిగిలి ఉన్న మరో 7 రౌండ్లు.
- గోవా లీడ్స్ :బీజేపీ 19, కాంగ్రెస్ -గోవా ఫార్వార్డ్ పార్టీ 12, ఎంజీపీ-టీఎంసీ 3, ఆప్ 2, ఇండిపెండెంట్ 3
- యూపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని, చివరి వరకు ఎదురుచూడాలని కార్యకర్తలను కోరింది సమాజ్వాదీ పార్టీ.
- యూపీలో ఖాతా తెరవని ఎంఐఎం.100 సీట్లలో పోటీచేసిన ఎంఐఎం. భాగీధారీ పరివర్తన్ పేరుతో కూటమి పేరుతో పోటీచేసిన ఎంఐఎంకి 0.35 శాతం ఓట్లు.
- మైనారిటీ ఓట్లను చీల్చిన ఎంఐఎం. యూపీలో అడ్రస్ గల్లంతయిన బీఎస్పీ.నాలుగుసార్లు సర్కార్ నడిపిన మాయావతి.
- గోవా లీడ్స్ : బీజేపీ 18, కాంగ్రెస్ 10, ఎంజీపీ 5
- 4 వ రౌండ్ ముగిసిన తర్వాత లీడింగ్ లో గోవా సీఎం ప్రమోద్ సావంత్
- పంజాబ్ కాంగ్రెస్ కు అమరీందర్ ఎఫెక్ట్. పంజాబ్‌లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్
- కాంగ్రెస్ కొంపముంచిన సిద్ధూ
- ఉత్తరాఖండ్ లోనూ ప్రభావం చూపించలేకపోయిన కాంగ్రెస్
- కాంగ్రెస్ కు పాంచ్ పటాకా దెబ్బ
- ఐదు రాష్ట్రాల ఫలితాలతో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- గోవాలో క్యాంప్ రాజకీయాల హవా. టీఎంసీ,ఆప్, ఎంజీపీలతో టచ్ లో వున్న కాంగ్రెస్
- యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ లో బీజేపీ, పంజాబ్ లో ఆప్ సర్కార్
- మణిపూర్‌లో అతి పెద్ద పార్టీగా బీజేపీ
- గోవాలో కీలకంగా మారిన తృణమూల్.
- యూపీ కౌంటింగ్: బీజేపీ-264, ఎస్పీ: 124, కాంగ్రెస్: 6, బీఎస్పీ 7
- పంజాబ్ కౌంటింగ్: ఆప్: 88, కాంగ్రెస్ : 12, ఎస్ ఏడీ-11, బీజేపీ-5
- ఉత్తరాఖండ్ : బీజేపీ 41, కాంగ్రెస్ 25
- గోవా: బీజేపీ 19, కాంగ్రెస్ 14, ఆప్ 2, ఇతరులు 7
- మణిపూర్: బీజేపీ-23, కాంగ్రెస్ 13, ఎన్పీపీ 11
- పంజాబ్ లో ఆప్ సంబరాలు. మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆప్.
- గోవా లీడ్స్ : బీజేపీ 18, కాంగ్రెస్ -గోవా ఫార్వార్డ్ పార్టీ 13, ఎంజిపి-టీఎంసీ 5, ఆప్ 1, ఇండిపెండెంట్ 2
- నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన బీజేపీ. ఉత్తరాఖండ్, గోవా సీఎంలు వెనుకంజ.
- పంజాబ్‌లో రికార్డు సీట్లలో ఆప్ ముందంజ. పంజాబ్‌లో చన్నీ, సిద్దూ వెనుకంజ. అన్ని పార్టీల సీనియర్లను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.
- గోవాలో క్యాంప్ రాజకీయాలు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో బిజీ అయిన కాంగ్రెస్
- గోవాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు. బీజేపీ 17, కాంగ్రెస్ 13, ఎంఏజి 5 , ఇండిపెండెంట్ 2, ఇతరులు2
- గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ. గోవాలో కీలకంగా తృణమూల్, ఇండిపెండెంట్లు.
- ఉత్తరాఖండ్, యూపీ బీజేపీ కైవసం
- గోవాలో కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రం.
- మణిపూర్ లో కీలకం కానున్న నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ
- పంజాబ్‌లో బీజేపీ, కాంగ్రెస్ ను ఊడ్చేసిన చీపురు పార్టీ
- కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపించలేకపోయింది. అతి పెద్ద రాష్ట్రం యూపీలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. యూపీలో రాహుల్, ప్రియాంక ప్రచారం ఏమాత్రం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
- గోవాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. బీజేపీ 19 స్థానాల్లో, కాంగ్రెస్ 15 స్థానాల్లో, ఆప్ 1 స్థానంలో ముందంజ ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
- పంజాబ్‌లో హేమాహేమీలకు షాకిచ్చిన ఆప్. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుదిశగా ఆప్. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి చన్నీ రెండుచోట్ల వెనుకంజ.
- యూపీలో యోగి హవా. అక్కడ వార్ వన్ సైడ్. యూపీ బాద్ షా యోగి. యూపీ లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్.
- ఉత్తరాఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం.
- గోవాలో కాంగ్రెస్ అభ్యర్ధి మైకేల్ లోబో వెనుకంజ
- ఉత్తరాఖండ్: బీజేపీ-34, కాంగ్రెస్ -34 స్థానాల్లో ఆధిక్యం.
- గోవా : బీజేపీ 11,కాంగ్రెస్ 3 ,ఇండిపెండెంట్ 2 ,ఎంజిపి 2, ఆప్ 1.
- గోవా డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి చంద్రకాంత్ కవలేకర్ వెనుకంజ
- యూపీలో దారుణమయిన పరిస్థితుల్లో కాంగ్రెస్. 5500 ఓట్ల ఆధిక్యంలో యోగి ఆదిత్యనాథ్.
- గోవాలో లీడ్స్ బీజేపీ 7 ,కాంగ్రెస్ 2 , ఇండిపెండెంట్ 2 , ఎంజీపీ 1,ఆప్ 1
- గోవా సీఎం బీజేపీ అభ్యర్థి ప్రమోద్ సావంత్ వెనుకంజ.
- పంజాబ్ లో రెండుచోట్ల ఆప్ సీఎం అభ్యర్ధి వెనుకంజ.
- యూపీలో బీజేపీ హవా. మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆధిక్యం. యూపీలో బీజేపీ-205 స్థానాల్లో ముందంజ. ఎస్పీ 106, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ. బీఎస్పీ 6 స్థానాల్లో ముందంజ.లఖింపూర్ ఖేరి ప్రాంతంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.
- పనాజీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి ఉత్పల్ పారికర్ ముందంజ. గోవాలో లీడ్స్ బీజేపీ 2, కాంగ్రెస్ 1 , ఇండిపెండెంట్ 1
- ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు.
- గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన గోవా కాంగ్రెస్. అమృత్ సర్ ఈస్ట్ లో సిద్ధూ ముందంజ. గోవాలోని సాంక్వెలిన్ లో ప్రమోద్ సావంత్ ఆధిక్యం.ఉత్తరాఖండ్: డెహరాడూన్ లోని మహారాణా ప్రతాప్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం అయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది.
- రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ . యూపీలో బీజేపీ ఆధిక్యం. పంజాబ్ లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరాహోరీ. పంజాబ్ సీఎం చన్నీ రెండు స్థానాల్లో ముందంజ. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ వెనుకంజ.
- ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

