Site icon NTV Telugu

మందుబాబులకు గుడ్ న్యూస్: ఇంటి వద్దకే మద్యం 

దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఒక్కొక్క రాష్ట్రం లాక్ డౌన్ విధిస్తు వస్తున్నాయి.  ఇప్పటికే 14 రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి.  ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ సమయంలో అన్ని రంగాలు మూతపడుతున్నాయి.  వ్యాపార సంస్థలు, షాపులు మూతపడుతున్నాయి.  షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు అన్ని మూతపడుతున్నాయి.  లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  వెరీ ఇబ్బందులను గుర్తించిన రాష్ట్రాలు ఇంటివద్దకే మద్యం సరఫరా చేసే సౌకర్యాలను పరిశీలిస్తోంది.  ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి మద్యాన్ని ఇంటివద్దకు సరఫరా చేసే విధంగా ఓ యాప్ ను తయారు చేసింది. సిఎస్ఎంసిఎల్ అనే యాప్ ను సిద్ధం చేసింది.  ఈ యాప్ లో వివరాలు నమోదు చేస్తే ఇంటివద్దకు మద్యం సరఫరా చేస్తారు.  లాక్ డౌన్ సమయంలో కూడా మందులేదని మందుబాబులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  

Exit mobile version