PAN Aadhaar Link: పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్‌పై ఐటీ శాఖ కీలక సూచన.. లాస్ట్ డేట్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Aadhaar Link: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్‌పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే 31లోగా లింక్ చేయాలని మంగళవారం పన్ను చెల్లింపుదారులను కోరింది. లింక్ చేయడంలో విఫలమైన అధిక రేటుతో పన్ను కోత/ చెల్లింపులు ఉంటాయని ఐటీ శాఖ సోషల్ మీడియా విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘ పన్ను చెల్లింపుదారులు, దయచేసి మీ పాన్ని మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మీరు ఇప్పటికీ ఇలా చేయకపోతే హైయ్యర్ రేట్‌తో టాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. దయచేసి CBDT సర్క్యులర్ నెం.6/2024 dtd 23 ఏప్రిల్, 2024, చూడండి’’ అని పేర్కొంది.
పాన్ని ఆధార్‌తో లింక్ చేయమని ఐటీ డిపార్ట్మెంట్ పన్ను చెల్లింపుదారుల్ని కోరడం ఇది మొదటిసారి కాదు. చేయని పక్షంలో 2024 మార్చి 31కి ముందు లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/ పన్ను చల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్/టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంత మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటుతో పన్ను చెల్లింపులు/ పన్ను కోతులు చేయకపోవడమే నోటీసులకు కారణమని చెప్పింది. ఇలాంటి వారికి చివరి తేదీగా మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆలోపు పాన్ యాక్టివేట్ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని చెప్పింది.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
Read Also: Amit Shah: అమిత్ షా ‘‘రాజకీయ చాణక్యుడు’’.. అఖిలేష్ యాదవ్ పార్టీ నేత ప్రశంసలు..
ఫైన్ చెల్లించి ఇలా లింక్ చేయండి:
* ముందుగా ఐటీ శాఖ వెబ్సైట్లో ఎంటర్ అవ్వాలి. అందులో ‘‘ఈ-పే ట్యాక్స్’’ క్లిక్ చేయాలి.
* పాన్ నంబర్ని రెండుసార్లు వెరిఫై చేయాలి. దాని దిగువన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* తర్వాత పేజీలో మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
* ఒకసారి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు వేర్వేరు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందలో ఒకటి ఎంచుకోవాలి.
* తర్వాతి ప్రక్రియలో అసెస్మెంట్ ఇయర్ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్ రిసిప్ట్స్ (Other receipts (500) ఎంచుకోవాలి.
* ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.
* పేమెంట్ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని లింక్ ఆధార్‌ను క్లిక్ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
పాన్ – ఆధార్ లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి:
* www.incometax.gov.inలో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని వెళ్లాలి.
* హోమ్‌పేజీలో, ‘క్విక్ లింక్స్’ ఎంపికపై క్లిక్ చేయండి.
* లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో మీ పాన్, ఆధార్ కార్డ్ నెంబర్లు ఎంటర్ చేయాలి.
* మీ పాన్ మరియు ఆధార్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే..‘‘ మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌తో లింక్ చేయబడింది’’ అనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
* ఒక వేళ లింక్ చేయకుంటే..‘‘ మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడలేదు. మీ ఆధార్‌ని పాన్‌తో లింక్ చేయడానికి దయచేసి ‘ లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి అనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
Kind Attention Taxpayers,
Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.
Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI
— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!