NTV Telugu Site icon

PAN Aadhaar Link: పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్‌పై ఐటీ శాఖ కీలక సూచన.. లాస్ట్ డేట్ వెల్లడి..

Pan Aadhaar Link.

Pan Aadhaar Link.

PAN Aadhaar Link: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్‌పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మే 31లోగా లింక్ చేయాలని మంగళవారం పన్ను చెల్లింపుదారులను కోరింది. లింక్ చేయడంలో విఫలమైన అధిక రేటుతో పన్ను కోత/ చెల్లింపులు ఉంటాయని ఐటీ శాఖ సోషల్ మీడియా విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘ పన్ను చెల్లింపుదారులు, దయచేసి మీ పాన్‌ని మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మీరు ఇప్పటికీ ఇలా చేయకపోతే హైయ్యర్ రేట్‌తో టాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. దయచేసి CBDT సర్క్యులర్ నెం.6/2024 dtd 23 ఏప్రిల్, 2024, చూడండి’’ అని పేర్కొంది.

పాన్‌ని ఆధార్‌తో లింక్ చేయమని ఐటీ డిపార్ట్మెంట్ పన్ను చెల్లింపుదారుల్ని కోరడం ఇది మొదటిసారి కాదు. చేయని పక్షంలో 2024 మార్చి 31కి ముందు లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/ పన్ను చల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్/టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంత మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటుతో పన్ను చెల్లింపులు/ పన్ను కోతులు చేయకపోవడమే నోటీసులకు కారణమని చెప్పింది. ఇలాంటి వారికి చివరి తేదీగా మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఆలోపు పాన్ యాక్టివేట్ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని చెప్పింది.

Read Also: Amit Shah: అమిత్ షా ‘‘రాజకీయ చాణక్యుడు’’.. అఖిలేష్ యాదవ్ పార్టీ నేత ప్రశంసలు..

ఫైన్ చెల్లించి ఇలా లింక్ చేయండి:
* ముందుగా ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో ఎంటర్ అవ్వాలి. అందులో ‘‘ఈ-పే ట్యాక్స్’’ క్లిక్ చేయాలి.
* పాన్ నంబర్‌ని రెండుసార్లు వెరిఫై చేయాలి. దాని దిగువన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* తర్వాత పేజీలో మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
* ఒకసారి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు వేర్వేరు పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందలో ఒకటి ఎంచుకోవాలి.
* తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts (500) ఎంచుకోవాలి.
* ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.
* పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

పాన్ – ఆధార్ లింక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి:
* www.incometax.gov.inలో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని వెళ్లాలి.
* హోమ్‌పేజీలో, ‘క్విక్ లింక్స్’ ఎంపికపై క్లిక్ చేయండి.
* లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో మీ పాన్, ఆధార్ కార్డ్ నెంబర్‌లు ఎంటర్ చేయాలి.
* మీ పాన్ మరియు ఆధార్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే..‘‘ మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌తో లింక్ చేయబడింది’’ అనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
* ఒక వేళ లింక్ చేయకుంటే..‘‘ మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడలేదు. మీ ఆధార్‌ని పాన్‌తో లింక్ చేయడానికి దయచేసి ‘ లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి అనే పాప్ అప్ మెసేజ్ వస్తుంది.