NTV Telugu Site icon

EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

Evms

Evms

EVM: ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు. అయితే, తీరా ఫలితాలు వెలువడిన తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. జూన్ 4 ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరును తప్పుబడుతూ ఒక్క కామెంట్ చేయలేదు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

అయితే, ఈవీఎంలను పనితీరును తప్పుబడుతూ ప్రతిపక్షాలు తిట్టడాన్ని ఉద్దేశిస్తూ సీఈసీ రాజీవ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బహుషా ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినట్లు ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి’’ అని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని అననారు. గత 20-22 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్‌కి గురవుతున్నాయని, వాటి విశ్వసనీయతను ఎప్పుడూ ప్రశ్నార్థకంగా ఎత్తి చూపేవారని, కానీ చివరకు ఎల్లప్పుడు అవి ఫలితాలను చూపించాయని అన్నారు.

Read Also: Modi Speech: “పవన్ నహి వో తుపాన్ హే” పార్లమెంట్లో ప్రశంసల వర్షం కురిపించిన మోదీ

‘‘ఈవీఎంలు అన్నింటికన్నా ముందున్నాయి, ఆ పూర్ ఫెల్లోని ఎందుకు నిందించాలి..? వచ్చే ఎన్నికల వరకు కొన్ని రోజుల విశ్రాంతినివ్వండి. ఆ తర్వాత మళ్లీ అవి తమ బ్యాటరీలను మార్చుకుని, పేపర్లను మార్చుకని వినియోగంలోకి వస్తాయి. అప్పుడు మళ్లీ వాటిని నిందించడం ప్రారంభం అవుతుంది. అవి ఫలితాలను ఇస్తాయి.’’ అని అన్నారు.

18వ లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికైన సభ్యుల పేర్లను భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని రాష్ట్రపతికి సమర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తు అయిన ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు అధ్యక్షుడు ముర్ము ఎన్నికల సంఘాన్ని అభినందించారు. మొత్తం దేశం తరపున, ఎన్నికల సంఘం, దాని అధికారులు మరియు సిబ్బంది సభ్యులు, ప్రచారం మరియు పోలింగ్ నిర్వహణ మరియు పర్యవేక్షణలో పాల్గొన్న ఇతర ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు మరియు భద్రతా సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర, ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు.

Show comments