NTV Telugu Site icon

Ram Narayan: ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత

Panditramnarayan

Panditramnarayan

ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ పండిట్ రామ్ నారాయణ్ (96) కన్నుమూశారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మరణాన్ని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. రామ్ నారాయణ్ మరణంతో సారంగిలో ఒక శకం ముగిసిందని తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన ఈ సంగీత విద్వాంసుడు 2005లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు.

ఇది కూడా చదవండి: Nirmal: సమగ్ర కుటుంబ సర్వేకు దూరంగా ఆ గ్రామాలు.. కలెక్టర్ కీలక ప్రకటన

రామ్ నారాయణ్ ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. పద్మ విభూషణ్ మరియు సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా పలు ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిట్ రామ్ నారాయణ్ శైలి ప్రత్యేకంగా నిలిచింది. నారాయణ్ మరణవార్త తెలియగానే సంగీత మాస్ట్రోకు సోషల్ మీడియాలో నివాళులర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

 

Show comments