Site icon NTV Telugu

కోర్టులోనే లాయర్ మర్డర్

కోర్టులోనే దారుణం జరిగింది.. ఓ లాయర్ ను నాటు తుపాకితో కాల్చి చంపారు దుండగులు… ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల లోకి వెళ్తే షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. ఆయన మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని కోర్టు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటన తో యూపీ లోని యోగి సర్కార్ పై విమర్శలు పెరిగాయి.. ఈ మధ్యే కేంద్ర మంత్రి కుమారుడు తీరుతో… యోగి సర్కార్ పై విమర్శలు రాగా.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వరుస ఘటనలు యోగి సర్కార్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Exit mobile version