Site icon NTV Telugu

లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన ప్రధాని మోదీ

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో అభిమానుల కన్నీటి నివాళుల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై అభిమాన గాయని పార్థివ దేహానికి కడసారిగా నివాళులర్పించారు. విషాదంలో ఉన్న లతా మంగేష్కర్ కుటుంబీకులను ప్రధాని మోదీ పరామర్శించారు.

ఆమె నివాసం నుంచి మొదలైన లతా మంగేష్కర్ అంతిమయాత్రకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మరోవైపు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు సైతం లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బరువెక్కిన హృదయాలతో లతా మంగేష్కర్‌కు నివాళులర్పించారు. కాగా లతా మంగేష్కర్ మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది.

Exit mobile version