NTV Telugu Site icon

Sikkim: సిక్కిం ముఖ్యమంత్రి భార్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా

Mistory

Mistory

సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. అనూహ్యంగా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.

కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భర్త ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేశారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు చెందిన పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) ఇటీవలి ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలు గెలుచుకుని.. అలాగే రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది.

ఇక కృష్ణ కుమారి రాయ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 5,302 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలైన ఓట్లలో 71.6 శాతం సాధించారు. సోరెంగ్-చకుంగ్‌లో 72.18 శాతం ఓట్లను పొందిన ముఖ్యమంత్రి తమాంగ్ తర్వాత ఆమె రెండవ స్థానంలో నిలిచింది. ఆమె నిర్ణయానికి గల కారణాలు తెలియనప్పటికీ.. కొత్తగా ఎన్నికైన స్పీకర్ మింగ్మా నోర్బు షెర్పా కూడా ఆమె రాజీనామాను గురువారం ఆమోదించారు. నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం ఇప్పుడు ఖాళీ అయింది. నామ్చి జిల్లాలో వరదల కారణంగా ఇద్దరు మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.

ఇది కూడా చదవండి: Crime News: బూతు వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ అత్యాచారం..