Sikkim: సిక్కిం ముఖ్యమంత్రి భార్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- సిక్కిం ముఖ్యమంత్రి భార్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- నామ్చి-సింగితాంగ్ నుంచి కృష్ణ కుమారి రాయ్ గెలుపు
- సిక్కిం వరదల తర్వాత రాయ్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. అనూహ్యంగా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.
కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భర్త ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేశారు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు చెందిన పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) ఇటీవలి ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలు గెలుచుకుని.. అలాగే రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
ఇక కృష్ణ కుమారి రాయ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 5,302 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పోలైన ఓట్లలో 71.6 శాతం సాధించారు. సోరెంగ్-చకుంగ్‌లో 72.18 శాతం ఓట్లను పొందిన ముఖ్యమంత్రి తమాంగ్ తర్వాత ఆమె రెండవ స్థానంలో నిలిచింది. ఆమె నిర్ణయానికి గల కారణాలు తెలియనప్పటికీ.. కొత్తగా ఎన్నికైన స్పీకర్ మింగ్మా నోర్బు షెర్పా కూడా ఆమె రాజీనామాను గురువారం ఆమోదించారు. నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం ఇప్పుడు ఖాళీ అయింది. నామ్చి జిల్లాలో వరదల కారణంగా ఇద్దరు మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.
ఇది కూడా చదవండి: Crime News: బూతు వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ అత్యాచారం..

తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!