Site icon NTV Telugu

Kolkata: మరో మోడల్ సూసైడ్.. మూడు రోజుల వ్యవధి ఇద్దరు మోడల్స్ ఆత్మహత్య

Manjusha

Manjusha

బెంగాల్ లో మరో విషాదం నెలకొంది. మరో మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. మంజూషా నియోగి అనే మోడల్ కోల్ కతా పటులి ప్రాంతంలో తన నివాసంలో శవమై కనిపించింది. మూడు రోజుల వ్యవధిలో కోల్ కతాలో ఇద్దరు మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల మంజూషా నియోగి ఫ్రెండ్ మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు రోజుల నుంచి తీవ్రమైన డిప్రెషన్ తో మంజూషా నియోగి బాధపడుతోంది. తన కూతురు డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు ఆమె తల్లి కూడా వెల్లడించింది.

ప్రస్తుతం పోలీసులు శవాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవచ్చని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల ముందు బిదిషా మజుందార్ కూడా కోల్ కతాలోని డమ్ డమ్ ప్రాంతంలో తను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ లో బుధవారం శవమై కనిపించింది. బిదిషా మజుందార్ పెళ్లి కూతురు యాడ్స్, ఫోటో షూట్ లకు ఫేమస్. అయితే ఇటీవల కాలంలో అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయి ఆత్మహత్య పాల్పడింది. కెరీర్లో అవకాశాలు లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ లెటర్ ను రాసి ఆత్మహత్య చేసుకుంది.

ఈ రెండు ఘటనలకు కొన్ని రోజుల ముందు మరో మోడల్, ఆర్టిస్ట్ పల్లబి డే కూడా కోల్ కతాలోని గార్ఫా ప్రాంతంలో అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకుని పల్లబి డే ఆత్మహత్యకు పాల్పడింది. పల్లబీ డే అదే ప్లాట్ లో లివ్ ఇన్ పార్ట్నర్ తో ఉంటోంది. వరసగా ఒకే నెలలో ముగ్గురు ఫేమస్ మోడల్స్ తనువు చాలించడం గ్లామర్ ఇండస్ట్రీని కలవరానికి గురి చేసింది.

Exit mobile version