NTV Telugu Site icon

Kishan Reddy: రామప్ప అభివృద్ధి చేసింది మేమే.. రాహుల్, ప్రియాంక.. మోడీకి థ్యాంక్స్ చెప్పాలి..

Kishareddy

Kishareddy

Kishan Reddy: రామప్ప అభివృద్ధి చేసింది సీఎం మోడీ అని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు..రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలని, రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంక లు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ కు జ్ఞాపక శక్తి తగ్గినట్లు ఉందని, రాహుల్ కు మతిమరుపు పెరిగిందని అన్నారు. వాస్తవాలు మర్చి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కు కొన్ని ప్రశ్నలు అడుగుతున్న.. రాహుల్ కు దమ్ము దైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టు కాలేదా? అధికారం పంచుకోలేదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా లేరా? రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు కాలేదా? 2014 లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు.. ఏ పార్టీలోకి వెళ్లి చేరారు? ఎవరికి ఓటు వేస్తే ఎవరికి లాభం జరిగింది? కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు మడుగులు వత్త లేదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ జాబితా సిద్దం కాగానే చెప్తామని అన్నారు. రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం అన్నారు. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.

రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమవుతామని తెలిపారు. అభ్యర్థుల కసరత్తు ప్రారంభం చేశామన్నారు. ఎవరికి ఎవరు బిటిమ్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బిటీమ్ అన్నారు. 2013 లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేసేందుకు చర్చలు జరగలేదా? అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు బిటిమో రాహుల్ చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ పై ఓటుకు నోటు కేసు ఏమయింది? ఎందుకు తొక్కి పెట్టారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మధ్యవర్తిగా మజ్లిస్ ను పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి అట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల DNA ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి అవగాహనతో మూడు పార్టీలు పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాహుల్ చర్చలు సిద్దమా? అని సవాల్ విసిరారు. డిల్లీ ఐనా, హైదరాబాద్ అయినా రాహుల్ తో నేను చర్చకు సిద్దం అని అన్నారు.
Tiger Nageswarara Rao : టైగర్ నాగేశ్వరావు గ్రాఫిక్స్ కోసం అంత టైం పట్టిందా..?