Site icon NTV Telugu

పోలీసుల కస్టడీకి కిరణ్‌ గోసావి..

చీటింగ్ ఆరోపణలపై పూణె సిటీ పోలీసులు అరెస్టు చేసిన కిరణ్ గోసావిని సిటీ కోర్టు నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి పంపింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో కిరణ్‌ గోసావి సాక్షిగా ఎన్సీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కిరణ్‌ గోసావిని విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరగా సిటీ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ గత నెలలో నిషేధిత డ్రగ్స్‌ కలిగిఉన్నారనే ఆరోపణలతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. దాదాపు 26 రోజుల పాటు జైలులో ఉన్న అనంతరం ఆర్యన్‌ ను అక్టోబర్‌ 28న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

Exit mobile version