Key facts about Aftab in Shraddha Walker’s murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ కీలక విషయాలను పోలీసులకు తెలియజేసింది.
Read Also: Chandrababu: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ”నన్ను, లోకేష్‌ని కూడా చంపేస్తారట..”
అఫ్తాబ్ ఫ్లాట్ కు రెండుసార్లు వెల్లినట్లు ఆమె వెల్లడించింది. అయితే తనకు అక్కడ శ్రద్ధావాకర్ శవం ఉన్నట్లు ఎలాంటి క్యూ లభించలేదని తెలిపింది. శ్రద్ధా తరువాత మానసిక వైద్యురాలితో డేటింగ్ నెరిపిన అఫ్తాబ్ ఆమెకు శ్రద్ధాకు చెందిన ఓ రింగును కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అక్టోబర్ 12న తనకు ఫ్యాన్సీ ఆర్టిఫిషయిల్ రింగ్ ను గిఫ్టుగా ఇచ్చినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. అఫ్తాబ్ ఎప్పుడూ కూడా భయపడినట్లు కనిపించలేదని ఆమె వెల్లడించింది. తన ముంబై ఇంటి గురించి తరుచూ తనకు చెప్పేవాడని ఆమె తెలిపింది. తనకు అఫ్తాబ్ కు డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. వివిధ డేటింగ్ సైట్ల ద్వారా అఫ్తాబ్ దాదాపు 15 నుంచి 20 మంది అమ్మాయిలతో టచ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంబుల్ యాప్ ద్వారా హత్య జరిగిన 12 రోజుల తర్వాత మే30న అఫ్తాబ్ పరిచయం అయిన అమ్మాయిని పోలీసులు కనుక్కున్నారు.
హత్య జరిగిన తర్వాత కూడా అఫ్తాబ్ ప్రవర్తన సాధారణంగానే అనిపించిందని.. అతని మానసిక పరిస్థితి సాధారణంగానే ఉందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్ వద్ద డియోడరెంట్ లు, పెర్ఫ్యూమ్‌ల కలెక్షన్ ఉందని.. తనకు తరుచుగా పెర్ఫ్యూమ్‌లను బహుమతిగా ఇచ్చేవాడని ఆమె చెప్పింది. అఫ్తాబ్ తరుచుగా స్మోకింగ్ చేసేవాడని పోలీసులకు వెల్లడించింది. వివిధ రకాల ఆహారాలను ఇష్టపడేవాడని.. వివిధ రెస్టారెంట్ల నుంచి మాంసాహార వస్తువులను ఆర్డర్ చేసే వాడని.. రెస్టారెంట్లో చెఫ్ లు ఎలా ఆహారాన్ని అలంకరిస్తారో అని వెల్లడించే వాడిని సదరు యువతి చెప్పింది. ఈ హత్య విషయం వెలుగులోకి రావడంతో సదరు మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని.. ప్రస్తుతం ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
