Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం..
- మూడో నిందితుడి అరెస్ట్..
- హత్య ప్లాన్ గురించి తెలుసని చెబుతున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో మూడో వ్యక్తి చేతన్ స్నేహితుడు రితేష్ హింగేని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన రితేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హత్య పథకం గురించి రితేష్‌కు తెలుసని, చేతన్ తన ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు రితేష్‌తో పంచుకున్నట్లు ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పారు.
అయితే, ఈ కేసులో ముందుగా కేతన్‌ను కిరాయి హంతకుడితో హత్య చేయించాలని చేతన్, సియాలు భావించారని, తర్వాత చేతన్, సియాలో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తు సమయంలో రితేష్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ముందు రితేష్ హత్య జరిగిన లోహగఢ్ కోటను సందర్శించాడా? లేదా ? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
ఈ కేసులో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కేతన్కు తీవ్రమైన గాయం లేదా, శరీరంలో ఏదైనా భాగానికి నష్టం కలిగించేలా ముగ్గురు ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఒకవేళ కేతన్కు తీవ్ర గాయాలైనా లేదా అతని శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నా, సియాతో జరగబోయే అతని వివాహాన్ని అడ్డుకోవచ్చని నిందితులు భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు సమయంలో ఈ కుట్రలో రితేష్ కూడా ఉన్నట్లు తేలిందని, దీంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు డిజిటల్ ఆధారాలపై కూడా పనిచేస్తున్నారు. పోలీసుల ప్రకారం, తొలగించబడిన వాట్సాప్ చాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చాట్లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను ఫోరెన్సిక్ పద్ధతిలో పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!