NTV Telugu Site icon

Shigella: కేరళలో వెలుగుచూసిన షిగెల్లా కేసు.. లక్షణాలు ఇవే..!

Shigella

Shigella

అసలే కరోనా సమయం.. ఏ కొత్త వైరస్‌ వెలుగు చూసినా.. అది కరోనా వేరియెంటేనా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, కేరళలో మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు అధికారులు.. ఏప్రిల్​27వ తేదీన కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎవరికీ వ్యాపించిన దాఖలాలు లేవంటున్నారు అధికారులు.. ఈ నెల 20వ తేదీన చిన్నారిలో షిగెల్లా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలనడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు.. ఆ చిన్నారి నివాసం పక్కనే ఉన్న మరో బాలికలో కూడా అనుమానిత లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

Read Also: TDP: 175 కాదు పదిహేడున్నర సీట్లు వైసీపీ గెలిస్తే గొప్పే..!

ఇక, ఈ షిగెల్లా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి..? వ్యాధి సోకినవారిని ఎలా గుర్తించాలి అనే వివరాల్లోకి వెళ్తే.. బాధితుల్లో జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట లాంటివి ప్రథమ లక్షణాలుగా చెబుతున్నారు వైద్యులు.. కలుషిత నీరు తాగడం, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిచెందే అవకాశాలున్నాయి.. ఈ వ్యాధి సోకిన ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. షిగెల్లా వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్​లోకి వెళ్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయని తెలిపారు వైద్యులు. గతంలోనూ షిగెల్లా వ్యాధిని కేరళను ఇబ్బంది పెట్టింది.. ఇప్పుడు మరోసారి కేసు వెలుగు చూడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం… కట్టడి చర్యలకు పూనుకుంది.