NTV Telugu Site icon

మంత్రి పొరపాటు..అంతలోనే కరెక్షన్

దేశమంతా గ‌ణ‌తంత్ర దినోత్స‌వాలు ఘనంగా జరుపుకుంటోంది. కేర‌ళ‌లో మంత్రి అహ్మ‌ద్ దేవ‌ర‌కోవిల్ పొరపాటు పడ్డారు. ఆయన ఎగరేసిన జాతీయ జెండా త‌ల‌కిందులు అయినట్టు మీడియా చెబితే అర్థమయింది. మంత్రి, జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల్లో పాల్గొన్న అధికారులు కూడా త‌ల‌కిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనార్హం.

READ ALSO దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే?

ఈ విష‌యాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో తిరిగి మరోమారు జెండా ఎగరేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జాతీయ జెండాను స‌రి చేసేంత వ‌ర‌కూ కార్య‌క్ర‌మాన్ని అలాగే నిలిపేశారు. ప‌ది నిమిషాల్లో జాతీయ జెండాను అవ‌న‌తం చేసి, స‌రిగ్గా ఎగిరేసిన త‌ర్వాతే కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. జెండా వందనం ఏర్పాట్లు ఎవరు చేశారనేది అధికారులు వాకబు చేస్తున్నారు.