Kerala Lottery winner is in Trouble: కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచారు ఓ ఆటో డ్రైవర్. ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నారు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నారు. నేను మనశ్శాంతిని కోల్పోయాను..ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన అంటున్నారు. నేను లాటరీ గెలిచినప్పటి నుంచి ప్రజలు వారివారి సమస్యలు చెబుతూ.. అవసరాలు తీర్చమని నన్ను అడగడానికి వస్తున్నారని.. నేను ఇంటికి వచ్చే వారితో ముట్టడించబడుతున్నానని అన్నారు.
Read Also: Jayam Ravi: ఐష్ చెప్పిన ఆ ఒక్క మాటతో నా పని అయిపోయిందనుకున్నాను
నేను లాటరీ గెలుచుకునే వరకు అనుభవించిన మనశ్శాంతిని ఇప్పుడు కోల్పోయానని అనూప్ చెబుతున్నారు. అనూప్ తన భార్య పిల్లలు, తల్లితో రాజధాని తివేండ్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకారియమ్ లో నివసిస్తున్నారు. అనూప్ స్థానిక లాటరీ ఎజెంట్ నుంచి టికెట్ కొన్నారు. ఇటీవల జరిగిన డ్రాలో మొదటి ప్రైజ్ గా రూ.25 కోట్లు గెలుచుకున్నారు. అన్ని పన్ను మినహాయింపులు పోగా.. రూ.15 కోట్లను ఆయన పొందనునున్నారు.
నేరు లాటరీ ఎందుకు గెలిచానని.. ఇప్పుడు అనుకుంటున్నానని.. చాలా మందిలాగే లాటరీ గెలిచినందుకు ఒకటి రెండు రోజులు ఆనందించానని.. కానీ ఇప్పుడు ఇదే ప్రమాదంగా మారిందని.. నేను ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నాని..ప్రజలు సహాయం కోసం నన్ను వెంబడిస్తున్నారని ఆయన అన్నారు. తన సోషల్ మీడియాను ఉపయోగించి నాకు ఇంకా డబ్బు రాలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని బదులు నేను తక్కువ ప్రైజ్ మనీ ఉన్న లాటరీ గెలిస్తే బాగుండేదని ఆయన వాపోతున్నారు. ప్రస్తుతానికి డబ్బు ఏం చేయాలో నిర్ణయించుకోలేదని.. రెండేళ్ల పాటు బ్యాంకులో పెడతానని అన్నారు. తనకు తెలిసిన వారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారని.. తన ఇంటికి వచ్చే ప్రజల సంఖ్య పెరగడంతో చుట్టుపక్కట వాళ్లు తిడుతున్నారని ఆయన చెబుతున్నాడు.
