NTV Telugu Site icon

Kerala: ట్రాన్స్‌జెండర్లను క్రీడా ఈవెంట్లకు అనుమతించాలి.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

Kerala High Court

Kerala High Court

Kerala HC allows transwoman sportsperson to participate in judo competition in women’s category: లింగమార్పడి చేసుకున్న వ్యక్తులను క్రీడా ఈవెంట్లలోకి అనుమతించాలని చెబుతూ.. కేరళ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వారు ఎంచుకున్న విభాగంలో పాల్గొనడానికి తప్పనిసరిగా అనుమతించాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేనప్పుడు వారు ఎంచుకున్న విభాగంలో తప్పకుండా పాల్గొనడానికి అనుమతించాలని చెప్పింది. జస్టిస్ విజి అరున్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ దరఖాస్తును విచారించింది. హైకోర్టు తీర్పుకు లోబడి తాత్కాలికంగా పోటీలో పాల్గొనేందుకు అనుమతించాలని జిల్లా స్థాయి జూడో పోటీ నిర్వాహకులను ఆదేశించింది.

కేరళకు చెందిన అనామిక అనే ట్రాన్స్ ఉమెన్ వేసిన పిటిషన్ ను శుక్రవారం కేరళ హైకోర్టు విచారించింది. కేసుల పూర్వాపరాలను పరిశీలిస్తే.. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరి లేకపోవడంతో.. తమను మహిళల కేటగిరీలో అనుమతించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ విజి అరుణ్ విచారించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేనప్పుడు.. తాము మహిళా విభాగంలో పాల్గొనవచ్చని కేసు వాదనలు జరిగాయి.

Read Also: Karnataka: ఇక ఎన్ కౌంటర్లే అంటూ.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు

పిటిషనర్ తనను స్త్రీగా గుర్తించాలని కోరుతున్నారని.. ట్రాన్స్‌జెండర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే.. ఆమె ఎంచుకున్న విభాగంలో పాల్గొనే విధంగా అనుమతించాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి, కేరళ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు నోటీసులు జారీ చేసింది. కోజికోడ్ జూడో అసోసియేషన్ జూడో పోటీలను నిర్వహిస్తోంది. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు అనామికను అనుమతించాలని కోర్టు ఆదేశించింది.