NTV Telugu Site icon

Kejriwal: కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం

Kejriwal

Kejriwal

హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాల్లో విష ప్రయోగం జరిపినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలు, హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నీటిని గురించి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని.. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్షన్ల కింద సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్‌కు సమన్లు ​జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు చట్టానికి అనుగుణంగా ఉంటాయని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Non Veg : హైదరాబాద్‌లో రేపు నాన్‌ వెజ్‌ షాపులు బంద్‌.. ఎందుకంటే..!

ఇదిలా ఉంటే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సైనీ పేర్కొన్నారు. బుధవారం యమునా నది నీరు తాగినట్లుగా తెలిపారు. అయితే నీరు విషపూరితంగా ఉండడంతో నయాబ్ సింగ్ సైనీ నీళ్లు తాగినట్లు నటించి.. వెంటనే నదిలో ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లు తాగలేని నీళ్లు ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని.. అలా ఎప్పటికీ జరగనివ్వని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ ఎక్స్ ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు.