Uttarakhand Tunnel Operation: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నారు. కొన్ని మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నారని రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. 17 రోజులుగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల బంధువులు వారి బట్టలు, బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
Read Also: Nithin : శ్రీలీల పై నితిన్ షాకింగ్ కామెంట్స్.. ఏందీ బ్రో అంత మాట అనేశావ్..
మరోవైపు 41 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన వెంటనే వారిని ఉత్తరాకాశీలోని ఆస్పత్రికి తరలించనున్నారు. మరోవైపు కార్మికులు ఏ క్షణాన్నైనా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో టన్నెల్ బయట 41 అంబులెన్సులను సిద్ధం చేశారు. దాదాపుగా 16 రోజులుగా కార్మికులు ఇందులో చిక్కుకుపోయారు. వీరి కోసం వారి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ మిషన్ చెడిపోవడంతో, రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు వెళ్లింది. మాన్యువల్ డిల్లింగ్ ద్వారా ‘‘ ర్యాట్ మైనర్స్’ ఉపయోగించి టన్నెల్ లోకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బొగ్గును వెలికితీసే పురాతన పద్దతి ద్వారా కొండలోకి మార్గాన్ని ఏర్పాటు చేసి కార్మికులను బయటకు తీసుకురాబోతున్నారు. కార్మికులను చేరుకోవడానికి దాదాపుగా 3 మీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది.
