NTV Telugu Site icon

Free Bus: మహిళలకు ‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన..

Karnataka

Karnataka

Free Bus: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పథకాల్లో మహిళలకు ‘‘ఫ్రీబస్’’ సదుపాయం ఒకటి. ప్రభుత్వం ఇప్పుడు ఈ ‘‘శక్తి’’ పథకాన్ని కొనసాగించడంపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీసీఎం డీకే శివకుమార్ బుధవారం చెప్పారు. లగ్జరీ కాని KSRTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే శక్తి పథకం, కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీల్లో ఒకటి. జూన్ 11, 2023న కర్ణాటక ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఇదే పథకాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

Read Also: Gold Price : పండగ రోజు షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే

ఇదిలా ఉంటే, బుధవారం కేఎస్ఆర్టీసీ ఐరావత్ క్లబ్ క్లాస్ 2.0 బస్సుల్ని ప్రారంభించింది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు తమ టిక్కెట్లు కొనుక్కోవడానికే మొగ్గు చూపిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా, ఈమెయిళ్ల ద్వారా ఈ విషయాన్ని మాకు తెలియజేశారని, దీనిపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సుమారుగా 5-10 శాతం మంది మహిళలు తాము స్వచ్ఛందంగా డబ్బులిచ్చి టికెట్ కొనుగోలు చేస్తామని చెబుతున్నా, కండక్టర్లు తీసుకోవడం లేదని చెప్పారని తెలిపారు. త్వరలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశమై ఈ విషయమై చర్చిస్తామని డీకే చెప్పారు.

Show comments