Site icon NTV Telugu

Karnataka: ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి.. హిందూ స్వామిజీ సంచలన వ్యాఖ్యలు..

Kumara Chandrashekaranatha Swamiji

Kumara Chandrashekaranatha Swamiji

Karnataka: కర్ణాటక విశ్వ వొక్కలిగ మహాసంస్తాన మఠం స్వామీజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని ఆయన పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు ఓటు వేసే అధికారం లేదని, అక్కడి చట్టాన్ని తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. కర్నాటకలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కుమార చంద్రశేఖరనాథ స్వామిజీ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. స్టార్టప్‌లకు రూ. 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..

ముస్లింలకు ఓటు హక్కును తొలగించడం భారతదేశంలో శాంతి, ఐక్యత కాపాడుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ముస్లిం వర్గానికి ఓటు హక్కు లేకుండా చట్టం తీసుకురావాలని అన్నారు. రాజకీయ నాయకులు ముస్లిం ఓట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్ మాదిరిగానే మైనారిటీ ఓటు హక్కును తొలగించాలని అన్నారు.

ఇటీవల వారాల్లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా కర్ణాటక విజయపుర జిల్లాలోని రైతులు తన భూములను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంపై వివాదం మొదలైంది. అక్కడ రైతులు బీజేపీ మద్దతు కోరారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య వక్ఫ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించారు.

Exit mobile version