NTV Telugu Site icon

Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..

Pani Puri

Pani Puri

Pani puri: ‘పానీ పూరి’ ఈ స్ట్రీట్ ఫుడ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు లాగించేస్తుంటారు. అయితే, ఈ పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోంది. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటింకుండా విక్రయిస్తున్నారు. దీంతో డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా. 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది. దీంట్లో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాల గురించి ఆందోళనలు నెలకొన్నాయి.

Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1

ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్ మరియు కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు. దీని తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పానీ పూరీలో క్యాన్సర్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా అనేక తినుబండారాల నుంచి సుమారు 250 పానీపూరీ నమూనాలను సేకరించారు. విచారణ తర్వాత, మొత్తం నమూనాలో 40 ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడైంది.

బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో వంటి క్యాన్సర్ కారక రసాయనాల ఉనికిని పరీక్షించారు. ఆహార పదార్థాల్లో ఉండే ఈ రసాయనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు హామీ ఇచ్చారు. దీనికి ముందు కాటన్ క్యాండీ, గోబీ, కబాబ్‌ల తయారీలో కృత్రియ రంగులో వాడకాన్ని కర్ణాటక నిషేధించింది.