NTV Telugu Site icon

Vote From Home: “ఇంటి నుంచే ఓటు”.. తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో ప్రారంభం..

Vote From Home

Vote From Home

Vote From Home: ఇకపై కొన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతోంది భారత ఎన్నికల సంఘం. 80 ఏళ్లకు పైబడిని వారు ఇకపై ఇంటి నుంచే ఓటేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో తీసుకురాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. తమ ఎన్నికల బృందాలు ఫారం-12డిలో ఓటర్ ఉన్న ప్రాంతానికి వెళ్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

80 ఏళ్లకు పైబడిన వారు పోలింగ్ కేంద్రానికి రావాలని ప్రోత్సహిస్తున్నామని, అయితే అలా రాలేని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ఓటింగ్ మొత్తం సీక్రెట్ గా నిర్వహించబడుతుందని, మొత్తం ప్రక్రియను వీడీయో తీయబడుతుందని ఆయన వెల్లడించారు. ఇంటి నుంచి ఓటేసే విధానం వచ్చినప్పుడు అన్ని పార్టీలకు సమాచారం ఇస్తామని ఆయన వెల్లడించారు. వికలాంగుల కోసం ‘సాక్షం’ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టామని, ఇందులో లాగిన్ అయి ఓటేసే సదుపాయాన్ని ఎంచుకోవచ్చని సీఈసీ తెలిపింది.

Read Also: LEO: విజయ్ Vs KGF విలన్… పాన్ ఇండియా సంభవం లోడింగ్

అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్ అయిన ‘సువిధ’ అనే మరో మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేశామని, సమావేశాలు, ర్యాలీల అనుమతి కోసం అభ్యర్థులు సువిధ పోర్టల్ ఉపయోగించుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) ఓటర్ల ప్రయోజనం కోసం ‘నో యువర్ కంటెస్టెంట్’( మీ అభ్యర్థిని తెలుసుకోండి) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. రాజకీయ పార్టీలు తమ పోర్టల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నేర నేపథ్యం ఉన్న అభ్యర్థిని ఎందుకు ఎంచుకున్నారు.? ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ ఇచ్చారో ఓటర్లకు తెలియజేయాలని రాజీవ్ కుమార్ కోరారు.

ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గురించి మాట్లాడిన రాజీవ్ కుమార్.. 24 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 సీట్లు రిజర్వ్‌ చేయబడ్డాయని, 2.59 మంది మహిళా ఓటర్లతో కలిపి 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 16,976 మంది 100 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 4,699 మంది థర్డ్ జెండర్లు, 9.17 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షల మంది, వికలాంగులు (పీడబ్ల్యూడీ) 5.55 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి మే 24 లోపు నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Show comments