Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు

  • కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు
  • బెంగళూరులో వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
  • మళ్లీ రచ్చ తప్పదా?
Karnataka2

Karnataka2

కేరళం ముఖ్యమంత్రి ఎంపిక గందరగోళం ఇంకా ముగియకుండానే మరొక రాష్ట్రంలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం ఎంపిక పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పోటీ పడుతుండడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది.

ఇక కేరళం పంచాయితీ ముగియకుండానే మరోసారి కర్ణాటకలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. ఈనెల 15న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని బెంగళూరులో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు వెలిశాయి. ‘‘నెక్ట్స్ సీఎం డీకే.శివకుమార్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కటౌట్లు వెలిశాయి. బెంగళూరులో భారీ పోస్టర్లు, కటౌట్లు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

కర్ణాటకలో ఎప్పటినుంచో సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య సీఎం పంచాయితీ నడుస్తోంది. ఆ మధ్య కాలంలో హస్తిన వేదికగా పెద్ద ఫైటింగే జరిగింది. కానీ కొద్ది రోజుల నుంచి స్తబ్దతగా ఉంది. తాజాగా మరోసారి డీకే.శివకుమార్ బర్త్‌డే పురస్కరించుకుని తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.