BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- కర్ణాటక కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్
- డీకే శివకుమార్ స్థానంలో బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BK Hariprasad: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ నియామకం జరగడం గమనార్హం. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీకే హరిప్రసాద్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు కర్ణాటకలో పార్టీని విజయపథంలో నడిపించి, కేపీసీసీ అధ్యక్షుడిగా విశేష సేవలందించిన డీకే శివకుమార్ సహకారాన్ని పార్టీ కొనియాడింది.
సిద్ధరామయ్య అభినందనలు..
బీకే హరిప్రసాద్ నియామకంపై మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హరిప్రసాద్‌కు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఉన్న విధేయత, పోరాట పటిమ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నమ్మకమైన నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పలు రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా వివిధ కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. డీకే శివకుమార్ ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా మారనున్న నేపథ్యంలో, సంస్థాగతంగా పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం ఈ అనుభవజ్ఞుడైన ఓబీసీ నాయకుడి పగ్గాలు అప్పగించిందని చెబుతున్నారు.
Also Read
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
తాజావార్తలు
-
Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!