Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల

  • నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ
  • 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
  • కీలక రాజ్యాంగ పదవుల భర్తీకి కూడా ఆమోదం
Dk Shiva Kumar

Dk Shiva Kumar

Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదిత మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలిపింది. మొత్తం 20 మంది కొత్త మంత్రుల పేర్లకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ జాబితా ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు కర్ణాటక శాసనసభ, శాసన మండలిలోని కొన్ని కీలక రాజ్యాంగ పదవుల భర్తీకి కూడా ఆమోదం లభించింది.

20 మంది కొత్త మంత్రుల జాబితా

మంత్రివర్గంలో చోటు దక్కనున్న 20 మంది నేతల జాబితా

పి.ఎం. నరేంద్రస్వామి
శివరాజ్ తంగడగి
రుద్రప్ప లమణి
కె.ఎస్. బసవంతప్ప
బి. నాగేంద్ర
టి. రఘుమూర్తి
బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్
రిజ్వాన్ అర్షద్
సంతోష్ లాడ్
మధు బంగారప్ప
పుట్టరంగశెట్టి
మంకాల వైద్య
డాక్టర్ అజయ్ సింగ్
ఎన్. చలువరాయస్వామి
కె.ఎం. శివలింగేగౌడ
హెచ్.సి. బాలకృష్ణ
గాయత్రి శాంతెగౌడ
బసవరాజ్ రాయరెడ్డి
విజయానంద్ కశప్పనవర్
లక్ష్మణ్ సవాడి

కీలక పదవులకూ ఆమోదం

మంత్రివర్గ విస్తరణతో పాటు శాసనసభ, శాసన మండలిలో కీలక పదవుల నియామకాలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపింది.

శాసనసభ స్పీకర్: జి.ఎస్. పాటిల్
శాసనసభ డిప్యూటీ స్పీకర్: ఎ.ఎస్. పొన్నన్న
శాసన మండలి ఛైర్మన్: సలీం అహ్మద్
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్: ఉమాశ్రీ

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల భేటీ

మంత్రివర్గ విస్తరణపై గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్, డీకే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.

‘99 శాతం ఖరారైంది’ అన్న డీకే శివకుమార్

మంత్రివర్గ విస్తరణపై గతంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొత్త మంత్రుల నియామకం దాదాపు ఖరారైందని, దీనిపై ‘99 శాతం నిర్ణయం పూర్తయింది’ అని తెలిపారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కొత్త మంత్రులు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా విస్తరణతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.